కార్మికుల జీతాల కోసం సర్పంచ్ భిక్షాటన

సిరిసిల్ల : గ్రామ పంచాయితీ కార్మికుల జీతాల కోసం భిక్షాటన చేశారు ఓ సర్పంచ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట సర్పంచ్ కటకం శ్రీధర్.. సోమవారం ప్రజలనుంచి విరాళాలు సేకరించారు. కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేకపోవడంతో భిక్షం ఎత్తుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలిచి నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తమకు చెక్ పవర్ ఇవ్వలేదని … కార్మికులకు జీతం ఇవ్వడానికి నిధులు లేవని చెప్పారు. గ్రామ పంచాయితీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వాళ్ల జీతాలకోసం బిక్షాటన తప్ప మరో దారి కనిపించలేదని చెప్పారు. అధికారుల దృష్టికి కార్మికుల సమస్యలను తీసుకెళ్లానని… అయితే చెక్ పవర్ ఇవ్వడం తమ పరిధిలో లేదన్నట్టుగా శ్రీధర్ చెప్పారు. మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లా నియోజకవర్గ పరిదిలో ఈ ఊరు ఉంది.

Latest Updates