గ్రామంలో గొడవ.. లెటర్ రాసి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా సర్పంచ్

గ్రామంలో కొందరితో జరిగిన గొడవ.. సర్పంచ్ ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్లింది. గొడవతో మనస్థాపం చెందిన నాగర్ కర్నూలు జిల్లా రంగాపూర్ గ్రామ సర్పంచ్ ఝాన్సీ ఆత్మహత్యాయత్నం చేశారు. పల్లె ప్రకృతి వనం ఏర్పాటు విషయంలో గ్రామంలో కొందరితో గొడవ జరగడంతో  మనస్తాపం చెందిన ఝూన్సీ నిద్రమాత్రలు మింగారు. దాంతో వెంటనే ఆమెను కల్వకుర్తి హాస్పిటల్‌కు తరలించారు. రంగాపూర్ గ్రామకంఠం భూమిలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని గ్రామపంచాయితీ సమావేశంలో నిర్ణయించారు. అయితే అదే గ్రామానికి చెందిన కొంతమంది.. ఆ భూమి తమదని సర్పంచ్‌తో గొడవకు దిగారు. దీంతో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. అయితే ఈ గొడవలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి తన కుటుంబ సభ్యులపై కేసులు పెట్టారని సర్పంచ్ లెటర్ రాసి ఆత్మహత్యాయత్నం చేశారు. తాను గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే.. గ్రామానికి చెందిన కొంతమంది మాత్రం అధికార పార్టీ నాయకుల అండతో తనపై కక్షగట్టారని ఆరోపించారు. తమపై దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోలేదని లెటర్‌లో తెలిపారు. తనను నమ్మి ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని క్షమాపణ చెబుతూ లెటర్ రాసి ఝాన్సీ ఆత్మహత్యాయత్నం చేశారు.

For More News..

వీడియో: పుట్టిన ఆర్నెళ్లకే స్కీయింగ్ చేసి రికార్డ్‌కెక్కిన బుడతడు

తెలంగాణలో కొత్తగా 2,176 కరోనా కేసులు

టీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థులు కరువు.. పోటీకే వెనుకాడుతున్న పల్లా, బొంతు

Latest Updates