ప్లాస్టిక్ వాడితే రూ.5 వేలు జరిమానా

మేడ్చల్, వెలుగు: ప్లాస్టిక్ ను నిషేధానికి అందరూ సహకరించాలని సర్పంచ్ బాబుయాదవ్ అన్నారు. మండల పరిధిలోని పూడూర్ పంచాయతీలో శనివారం మద్యం షాపుతో పాటు వివిధ షాపుల యాజమానులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాస్టిక్ వాడకాన్ని అందరూ మానుకోవాలని, దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు ఉంటే వారికి 5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి అర్చన, ఎంపీటీసీ రఘు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Latest Updates