సర్పంచి వేధిస్తున్నాడని పురుగుల మందు తాగాడు

బెల్లంపల్లి, వెలుగు: సర్పంచి వేధిస్తున్నాడంటూ ఓ యువకుడు పురుగుల మందు తాగాడు. బాధితుడి తల్లి బాయక్క వివరాల ప్రకారం… మంచిర్యా ల జిల్లా తాండూర్ మండలం కాసిపేట గ్రామానికి చెందిన బాపు ఇటీవలి ఎన్నికల్లో సహకరించలేదని సర్పంచి రమేష్ కక్ష కట్టాడు. కొద్ది రోజులుగా వేధింపులకు పాల్పడుతున్నాడు.

ఆదివారం పొలంలో బోరు వేసుకుంటుండగా సర్పంచ్ అనుచరులతో వచ్చి పనులను నిలుపుదల చేయించాడు. దీంతో తనకు నష్టం జరుగుతుందని, ఇక పంట సాగు చేసుకునే అవకాశం ఉండదేమోనని మనస్తాపం చెందిన బాపు కుమారుడు సాగర్ పంట పొలంలో ఉన్న పురుగుల మందు తాగాడు. అక్కడున్నవారు వెంటనే బెల్లంపల్లి హాస్పిటల్ కు తరలించా రు. పరిస్థితి విషమంగా ఉండటంతో సాగర్ ను మంచిర్యా ల ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేశారు.

Latest Updates