మంత్రి డుమ్మా కొడితే కార్మికుడితో మొక్క నాటించిన సర్పంచ్

sarpanch-padma-plant-a-tree-with-grampanchayat-servant-against-minister-koppula-eshwar

హరితహారం కార్యక్రమానికి రాకుండా మంత్రి అవమానించారని ఆయన నాటాల్సిన మొక్కను గ్రామ పారిశుధ్య కార్మికునితో నాటించి.. అతడిని సర్పంచ్‌ సన్మానించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్‌లో ఈ ఘటన జరిగింది.

గ్రామంలో లక్ష మొక్కలు నాటాలని గ్రామ పాలకవర్గం లక్ష్యంగా నిర్ణయించింది. బుధవారం మొక్కలు నాటే కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఆహ్వానించింది. అయితే గ్రామ సర్పంచ్‌ పద్మ తన వర్గం కాకపోవడంతో అదే గ్రామంలో ఇంకో కార్యక్రమానికి హాజరైన మంత్రి.. మొక్కలు నాటేందుకు మాత్రం వెళ్లలేదు. దీంతో సర్పంచ్‌ పద్మ.. పంచాయతీలో పని చేసే గ్రామ పారిశుధ్య కార్మికుడు లచ్చయ్యతో మొక్క నాటించి సన్మానించారు. మంత్రిని కార్యక్రమానికి పిలిచినా రాకుండా అవమానించారని గ్రామస్తులు అన్నారు.

Latest Updates