గ్రామాభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర: సబితా

గ్రామాల అభివృద్ధి లో సర్పంచులదే కీలక పాత్ర పోషిస్తున్నారు అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సర్పంచులు బాధ్యత గా వ్యవహరించి గ్రామాల అభివృద్ధి కి తోడ్పడాలని ఆమె సూచించారు. రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ హైస్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో సబితారెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు మంత్రి చేతుల మీదుగా 103 గ్రామ పంచాయతీల కు చెత్త సేకరణ నిమిత్తం ట్రాక్టర్లు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో మాట్లాడుతూ….ఇటీవల నిర్వహించిన 30 రోజుల ప్రణాళిక తో గ్రామాల్లో పరిశుభ్రత పై ప్రజల్లో చైతన్యం వచ్చిందని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల అభివృద్ధి లో సర్పంచులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. త్వరలోనే జిల్లా లోని మిగతా అన్ని గ్రామ పంచాయతీ లకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తామని చెప్పారు సబితా. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి , జిల్లా కు చెందిన ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, కాలె యాదయ్య లు పాల్గొన్నారు.

Latest Updates