పదో తరగతితో పోలీసు కొలువులు

పదో తరగతితో పోలీసు కొలువులు

పదో తరగతి అర్హతతో సెంట్రల్​ కొలువు సొంతం చేసుకునేందుకు సశస్త్ర సీమ బల్‌‌ స్పోర్ట్స్‌‌ కోటాలో కానిస్టేబుల్‌‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. ఖాళీలను ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసినప్పటికీ భవిష్యత్​లో పర్మినెంట్‌‌ చేసే అవకాశం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్​ ప్రకటించిన వాటిలో కానిస్టేబుల్‌‌ (జనరల్‌‌ డ్యూటీ), గ్రూప్‌‌–-సి నాన్‌‌ గెజిటెడ్‌‌ పోస్టులు 399 ఉన్నాయి. వయసు 18- నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. 

సెలెక్షన్​

క్రీడా విజయాలు, రాత పరీక్ష, ఫీల్డ్‌‌ ట్రయల్, స్కిల్, ఫిజికల్‌‌ స్టాండర్డ్‌‌ టెస్ట్, డిటైల్డ్‌‌ మెడికల్‌‌ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్‌‌ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తులు: అభ్యర్థులు రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు) ​ ఫీజు చెల్లించాలి. 

ఫీల్డ్‌‌ ట్రయల్‌‌/ స్కిల్‌‌ టెస్ట్‌‌

డాక్యుమెంట్‌‌ వెరిఫికేషన్‌‌లో అర్హత సాధించిన అభ్యర్థులను ఈ టెస్ట్‌‌కు ఎంపికచేస్తారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులు, జాతీయ స్థాయి పతకాలు గెలుచుకున్నవారికి స్కిల్‌‌ టెస్ట్‌‌ నుంచి మినహాయింపు ఉంటుంది. ఇంకా ఖాళీలు మిగిలినట్లయితే ఆల్‌‌ ఇండియా యూనివర్సటీ, నేషనల్‌‌ స్కూల్‌‌ గేమ్స్‌‌లో గెలిచినవారికి ఫీల్డ్‌‌ టెస్ట్‌‌/ స్కిల్‌‌ టెస్ట్‌‌ను నిర్వహిస్తారు. 

ఫిజికల్‌‌ స్టాండర్డ్‌‌ టెస్ట్‌‌ (పీఎస్‌‌టీ)

ఫీల్డ్‌‌ ట్రయల్‌‌లో అర్హత సాధించిన వారికి పీఎస్‌‌టీ నిర్వహిస్తారు. పురుష అభ్యర్థులు 170 సెం.మీ. ఎత్తు, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ.ఉండాలి. 

అప్లికేషన్స్​ పంపాల్సిన అడ్రస్​

ది ఇన్‌‌స్పెక్టర్‌‌ జనరల్, ఫ్రంటియర్‌‌ హెడ్‌‌ క్వాటర్, ఎస్‌‌ఎస్‌‌బీ పట్నా, 3వ ఫ్లోర్, కార్పురీ ఠాకుర్‌‌ సదన్, అషియానా-ఢోగ్లా రోడ్, పట్నా - 800 025, బిహార్‌‌.  వివరాలకు www.ssbrectt.gov.in వెబ్​సైట్​ సంప్రదించాలి.