జనగామలో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ హాల్టింగ్‌

విజయవాడ-సికింద్రాబాద్‌ మధ్య నడిచే శాతవాహన సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇవాళ్టి (గురువారం,ఫిబ్రవరి-21) నుంచి జనగామ రైల్వేస్టేషన్‌లో హాల్టింగ్‌ ఇవ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం విజయవాడ నుంచి బయలుదేరే శాతవాహన రైలు ఉదయం 10.15గంటలకు జనగామకు చేరుకొని ఉదయం 10.16కు సికింద్రాబాద్‌ పైపుకు బయలుదేరుతుంది. తిరిగి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి జనగామకు సాయంత్రం 5.15గంటలకు చేరుకొని 5.16కు విజయవాడ వైపు బయలుదేరుతుంది. జనగామ స్టేషన్‌లో కేవలం ఒక్క నిమిషం మాత్రమే హాల్టింగ్ ఇవ్వనున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 10గంటలకు జనగామ స్టేషన్‌లో శాతవాహన హాల్టింగ్‌కు పచ్చజెండా ఊపి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Latest Updates