
కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఇండియాకు మరో స్వర్ణం లభించింది. ఆదివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సతీయాన్–అర్చన కామత్ జోడీ 11–1, 11–7, 11–4తో పెంగ్ కొయెన్–జియో రూయ్ జియాన్ (సింగపూర్)పై గెలిచి టాప్‌లో నిలిచింది. దీంతో ఈ టోర్నీలో ఇండియా గోల్డ్ మెడల్స్ సంఖ్య మూడుకు చేరింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో సతీయాన్ 11–7, 11–8, 11–8, 11–6తో బోడే అబిడోన్ (నైజీరియా)పై, హర్మీత్ దేశాయ్ 11–4, 11–8, 6–11, 11–7, 11–8తో సుస్మిత్ శ్రీరామ్‌పై గెలవగా, స్టార్ ప్లేయర్ శరత్ కమల్ 11–7, 11–9, 8–11, 11–4, 9–11, 7–11, 10–12తో పెంగ్ యు కొయెన్ (సింగపూర్) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో అహికా ముఖర్జీ 11–6, 11–6, 11–2, 11–8తో మౌసమి పాల్‌పై, శ్రీజ ఆకుల 11–5, 11–6, 11–9, 17–19, 6–11, 17–15తో సుతీర్థ ముఖర్జీ పై, మధురికా పాఠ్కర్ 11–4, 9–11, 11–8, 12–10, 11–9తో కృత్వికా సిన్హా రాయ్ పై గెలిచి సెమీస్ చేరారు.