మంత్రిగా సత్యవతి రాథోడ్ ప్రమాణం..పొలిటికల్ జర్నీ

ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళి సై సత్యవతి చేత ప్రమాణం చేయించారు. మహబూబాబాద్  జిల్లా గుండ్రాతిమడుగుకు చెందిన సత్యవతి రాథోడ్  రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1996లో గుండ్రాతిమడుగు సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆమె. 2007లో నర్సింహుల పేట జెడ్పీటీసీగా గెలిచారు. 2009లో మొదటిసారి డోర్నకల్  ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీఆర్ ఎస్  తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలిగా ఉన్న ఆమెను సీఎం కేసీఆర్  తాజా కేబినెట్  విస్తరణలో మంత్రిగా అవకాశం కల్పించారు.

Latest Updates