న్యూ సౌదీ నిర్మాణంలో భారతీయుల పాత్ర గొప్పది: ప్రిన్స్

రెండురోజుల పర్యటనకోసం నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చారు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్. ఆయనకు ఎయిర్ పోర్టులో ప్రధానమంత్రి స్వాగతం పలికారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ ఉదయం మొహమ్మద్ బిన్ సల్మాన్ కు ఘనస్వాగతం పలికారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రాష్ట్రపతి భవన్ దగ్గర భద్రతా దళాలు సౌదీ యువరాజుకు గౌరవ వందనం సమర్పించాయి.

భారత్-సౌదిల మధ్య మంచి సంబంధాలున్నాయన్నారు మొహమ్మద్ బిన్ సల్మాన్. ఆధునిక సౌది నిర్మాణంలో భారతీయుల పాత్ర ఉందన్నారు. ప్రధాని, రాష్ట్రపతి సారథ్యంలో భారత్-సౌది సంబంధాలను మరింత బలోపేతమవుతాయన్నారు మొహమ్మద్ బిన్ సల్మాన్.

ఆ తర్వాత హైదరాబాద్ హౌజ్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సౌదీ యువరాజు సల్మాన్ భేటీ అయ్యారు. ఆయనకు మోడీ సాదరంగా స్వాగతం పలికారు.

Latest Updates