ఇండియాకు ప్రయాణాలను నిలిపివేసిన సౌదీ అరేబియా

న్యూఢిల్లీ: కరోనా వైరస్ చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా ప్రయాణాలపై వైరస్ ఎఫెక్ట్ పడింది. వైరస్ వ్యాప్తి భయంతో చాలా దేశాలు ఇతర కంట్రీస్‌‌కు ప్రయాణాలను నిలిపివేశాయి. ఈ కోవలోనే తాజాగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇండియాకు ప్రయాణాలను సౌదీ అరేబియా సస్పెండ్ చేసింది. ఇండియాతోపాటు బ్రెజిల్, అర్జెంటీనా నుంచి విమాన సర్వీసులను సౌదీ సస్పెండ్ చేసింది. ఇండియా, బ్రెజిల్, అర్జెంటీనా నుంచి ప్రయాణాలను నిలిపివేశామని సౌదీ అరేబియా సివిల్ ఏవియేషన్ అథారిటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఎయిర్ బబుల్ ఏర్పాట్ల కింద ఇండియా-సౌదీ అరేబియా మధ్య ప్రయాణాలు జరగడం లేదు.

Latest Updates