పాక్ మాకు ప్రియమైన దేశం: సౌదీ యువరాజు

పాకిస్తాన్ తమకు ప్రియమైన దేశం అని అన్నారు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబందాలు బలోపేతం చేసేందుకు సల్మాన్ పాకిస్తాన్ లో పర్యటిస్తున్నారు. పాక్ తొందరలోనే ఆర్థికంగా బలోపేతం అవుతుందని అన్నారు. పెట్రో కెమికల్, స్పోర్ట్స్, పవర్ జనరేషన్ ప్రాజెక్టులతో పాటు పలు ఒప్పందాలు చేసుకున్నారు.  సౌదీ యువరాజు మాట్లాడుతూ.. నేను యువరాజుగా పట్టిభిషిక్తున్ని అయిన తరువాత మొదటి పర్యటన పాకిస్తాన్ లో చేస్తున్నానని చెప్పారు.  ఇరు దేశాలు కలిసి అభివృద్ది చెందుతాయని ఆయన అన్నారు. పాకిస్తాన్ కు సహాయం చేసేందుకు సౌదీ ముందుంటుందని.. పాక్ తమకు ప్రియమైన దేశమని ఆయన అన్నారు. సౌదీలో ఖైదీలుగా ఉన్న 2107 మంది పాకిస్తాన్ పౌరులను విడుదల చేశారు సౌదీ యువరాజు.

ప్రపంచదేశాలు మొత్తం పాకిస్తాన్ సాగిస్తున్న ఉగ్రచర్యలను ఖండిస్తుంటే.. సౌదీ మాత్రం పాకిస్తాన్ కు దన్నుగా నిలవడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే అమెరికా సైతం పాక్ కు ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని నిలిపివేసింది.

Latest Updates