బెజోస్‌ ఫోన్‌ హ్యాక్‌ చేసిన సౌదీ ప్రిన్స్‌ ఎంబీఎస్

ప్రపంచ కుబేరుడు, అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ ఫోన్‌ హ్యాకయిం దని ప్రముఖ ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్‌ గార్డియన్‌ వెల్లడించింది. బెజోస్ కు సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పంపిన ఓ వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా ఫోన్ ను హ్యాక్‌ చేశారని చెప్పింది. 2018 మే 1న బెజోస్‌, మహ్మద్‌ మధ్య ఫ్రెండ్లీ చాటింగ్‌ జరిగిందని, ఆ టైంలో మహ్మద్‌ పంపిన ఓ వీడియో మెసేజ్‌ ద్వారా బెజోస్‌ ఫోన్ లోకి హానికర వైరస్‌ జొరబడినట్టు ఫోరెన్సిక్‌ విచారణలో తేలిందని పేర్కొంది. ఫోన్ ను హ్యాక్‌ చేసి భారీ స్థాయిలో డేటాను దొంగిలించినట్టు తెలుస్తోంది. ఐతే ఏ డేటాను దొంగిలించారో
మాత్రం తెలియరాలేదు. ఈ హ్యాకింగ్‌ వెనుక సౌదీ ప్రిన్స్‌ ఉండి ఉండొచ్చని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఐక్యరాజ్యసమితికి చెందిన ఇద్దరు అధికారులు కూడా సౌదీనే బెజోస్‌ ఫోన్ ను హ్యాక్‌ చేసినట్టు గుర్తించిందని సమాచారం. ఇందుకు సంబంధించి
తమ దగ్గర ఆధారాలున్నాయని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని చెప్పినట్టు తెలిసింది. ఫోన్‌ హ్యాక్‌ వార్తలపై అమెరికాలోని సౌదీ ఎంబసీ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదంది. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. బెజోస్ ఫోన్‌ హ్యాకైన 8 నెలల తర్వాత జనవరిలో నేషనల్ ఎంక్వైరర్ అనే పత్రిక మెసేజ్ లతో సహా ఆయన వ్యక్తిగత జీవితంపై రహస్య విషయాలను ప్రచురించింది. అమెరికా న్యూస్‌ యాంకర్‌ లారెన్ తో బెజోస్ కు వివాహేతర సంబంధముందని చెప్పింది. దీంతో ఆ పత్రికపై బెజోస్‌ విమర్శలు గుప్పించారు. తన న్యూడ్‌ ఫొటోలను పబ్లిష్‌ చేస్తామని బ్లాక్ మెయిల్‌ చేస్తున్నారని ఆరోపించారు. తర్వాత బెజోస్ కు భార్య మెకంజీ విడాకులిచ్చారు.

see also: 

వరల్డ్ రికార్డ్: 75 ఏళ్ల వయసులో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా..

‘మంజు చాలామందితో…. అందుకే చంపేశా’

దివ్యాంగురాలిని వరించిన అదృష్టం

Latest Updates