ఫ్లైటిచ్చి పంపిస్తే అవమానిస్తావా?

ఇమ్రాన్‌పై సౌదీ యువరాజు కన్నెర్ర
ఫ్లైట్​ వెనక్కి పంపాలని ఆర్డర్
ఆ ‘టెక్నికల్​ప్రాబ్లం’ వెనకున్న కథ..
ఇదేనంటూ బయటపెట్టిన పాక్​ పత్రిక

ఇస్లామాబాద్: ‘‘చిరకాల మిత్రుడివని స్పెషల్​ ఫ్లైటిచ్చి మరీ సాగనంపితే.. యూఎన్​ సమావేశాల్లో నన్నే అవమానిస్తావా? నన్ను కాదని ఆ ఎర్డోగాన్, మహతిర్​ మహ్మద్​తో కలిసి ఇస్లామిక్​ దేశాల వాదన వినిపించాలని డిసైడ్​ అయితవా.. దోస్తువని మర్యాదిస్తే నువ్వు చేసే పని ఇదా? ఇకచాలు నువ్వూ, నీ దోస్తానా.. నా ఫ్లైట్​ నాకు పంపించెయ్’’ అంటూ సౌదీ క్రౌన్​ ప్రిన్స్​ మహ్మద్​ బిన్​ సల్మాన్​ పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​పై ఫైరయ్యారట. పదాలు కాస్త అటూ ఇటూ కావొచ్చు కానీ ఇంచుమించు అర్థం మాత్రం అదేనని పాకిస్తానీ పత్రిక ‘ది ఫ్రైడే టైమ్స్’ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది.

మొన్న ఇమ్రాన్​ ఖాన్​ తిరిగొస్తున్న ఫ్లైట్​టెక్నికల్​ ప్రాబ్లంతో ఆగిపోవడం, తర్వాతి రోజు ఇమ్రాన్​ కమర్షియల్​ ఫ్లైట్​లో ఇస్లామాబాద్​ చేరుకోవడం వెనకున్న కథ ఇదేనని పేర్కొంది. ఆ ఫ్లైట్​లో ఎలాంటి ప్రాబ్లంలేదని, సౌదీ యువరాజు ఆదేశాలతోనే ఫ్లైట్ ను ఆపేసినట్లు వివరించింది. అయితే, ఇదంతా తప్పుడు ప్రచారమని పాక్​ ప్రభుత్వం ఖండించింది. సౌదీతో పాకిస్తాన్​కు సోదర సంబంధాలు ఉన్నాయని, ఇకపైనా కొనసాగుతాయని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.

అసలేం జరిగిందంటే..

న్యూయార్క్​లో జరిగిన యూఎన్​ సమావేశాలకు ముందు ఇమ్రాన్​ ఖాన్​ సౌదీలో రెండు రోజులు పర్యటించారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్​ మహ్మద్​ బిన్​ సల్మాన్​ పాక్​ ప్రధానిని సాదరంగా ఆహ్వానించి, మర్యాదలు చేశారు. చర్చల తర్వాత న్యూయార్క్​ వెళ్లేందుకు తన స్పెషల్​ ఫ్లైటిచ్చి పంపారు. యూఎన్​ సమావేశాల్లో ఇమ్రాన్​ ఖాన్​ టర్కీ ప్రెసిడెంట్​తయ్యిబ్​ ఎర్డోగాన్, మలేషియా ప్రధాని మహతిర్​ మహ్మద్​తో కలిసి ముస్లిం దేశాల వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. తర్వాత ఇరాన్​ అధికార ప్రతినిధితో చర్చలకు సిద్ధపడ్డారు. సమావేశాలు ముగిసాక సెప్టెంబర్​28న సౌదీ యువరాజు ఇచ్చిన ఫ్లైట్​లో ఇస్లామాబాద్​కు బయల్దేరారు. ప్రయాణం ప్రారంభించిన కాసేపటికే టెక్నికల్​ ప్రాబ్లం పేరుతో ఫ్లైట్​ వెనక్కొచ్చి న్యూయార్క్​లో దిగింది. ఆ మరుసటి రోజు కమర్షియల్​ ఫ్లైట్​లో ఇమ్రాన్​ పాక్​చేరుకున్నారు.

Latest Updates