సౌదీలో ఆ శిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు

రియాద్: సౌదీ అరేబియాలో కొరడా దెబ్బల శిక్షను రద్దు చేస్తున్నట్లు అక్కడి సుప్రీంకోర్టు శనివారం ప్రకటించింది. ఇది మానవ హక్కుల రక్షణకు సౌదీ రాజు తీసుకున్న గొప్ప నిర్ణయమని మెచ్చుకుంది. దీన్ని దేశంలోనే కీలక మానవ హక్కుల సంస్కరణగా పేర్కొంది. సౌదీలో కొన్ని నేరాలకు కొరడా దెబ్బలను శిక్షగా విధిస్తుంటారు. దీన్ని రద్దు చేయాలని హ్యూమన్​రైట్స్​ సంఘాలు ఎప్పటి నుంచో పోరాడుతున్నాయి. ఇక నుంచి కొరడా దెబ్బల శిక్షకు బదులు ఫైన్, జైలు శిక్ష వేయడం, కమ్యూనిటీ సర్వీస్ చేయించడం లాంటి పనిష్మెంట్​లు ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.

Latest Updates