కరోనాతో మరణించిన గాంధీ సెక్యూరిటీకి సావిత్రిబాయి పూలే అవార్డు

హైదరాబాద్‌, వెలుగు :కరోనాతో మరణించిన గాంధీ ఆసుపత్రి సెక్యూరిటీ సూపర్ ​వైజర్ ​గంపల బాలరాజుకు ‘సావిత్రి బాయి పూలే స్మారక కరోనా వారియర్స్​-2020’ అవార్డును ‘అసోసియేషన్​ఆఫ్​ విమెన్​ రైట్స్​యాక్టివిస్ట్​మెడికల్(ఔరా) సంస్థ ప్రకటించింది. ఈ మేరకు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ మంగళవారం బాలరాజు ఫ్యామిలీకి అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలరాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, ఔట్​సోర్సింగ్​జాబ్‌ ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. మృతుడి ఇద్దరు కుమారుల చదువుల కోసం తమ సంస్థ తరపున30వేల ఆర్థికసాయం అందించామని ఔరా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు, గాంధీ ఆస్పత్రి రిటైర్డ్ ఆర్ఎంఓ డా.ప్రమీల చెప్పారు. ఎజైల్​సెక్యూరిటీ ఫోర్స్​సంస్థ లక్షా40 వేలను అందించిందని గాంధీ ఆస్పత్రి చీఫ్​సెక్యూరిటీ అధికారి ప్రదీప్​కుమార్​తెలిపారు. కార్యక్రమంలో ఔరా సభ్యురాలు, నాట్కో సంస్థ కౌన్సిలర్​ కృష్ణవేణి, సెక్యూరిటీ సూపర్ ​వైజర్​జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Latest Updates