ఇట్స్ అఫీషియల్ : పెళ్లి చేసుకోబోతున్న ఆర్య, సాయేషా

కోలీవుడ్ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషా సైగల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ విషయాన్ని స్వయానా ఆర్య ఇవాళ ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతుండగా..మొత్తానికి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.  “ఈ రోజు ప్రేమికుల రోజును పురస్కరించుకుని తాము ప్రేమించుకుంటున్న విషయం నిజమే” అని ట్వీట్ చేశాడు ఆర్య. సాయేషాతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ‘మా తల్లిదండ్రులు, కుటుంబీకుల ఆశీస్సులతో మేమిద్దరం మార్చిలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నాం. మా కొత్త ప్రయాణం సంతోషంగా సాగాలని ఆశీర్వదించండి’ అని తెలుపుతూ అభిమానులకు వాలంటైన్స్‌ డే విషెస్‌ తెలిపాడు.

2018లో వ‌చ్చిన గ‌జినీకాంత్ అనే సినిమాలో ఆర్య‌, సాయేషా క‌లిసి న‌టించారు.  ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారని అప్పట్లో వార్తలు షికారు చేశాయి. అప్పటికే ఇరు కుటుంబాలు వీరి ప్రేమను ఒప్పుకొన్నట్లు వార్తలు వచ్చాయి. సాయేషా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు దిలీప్‌ కుమార్‌ మనవరాలు.

ప్రేమ విషయం చెప్పిన ఆర్యకి పలువురు సినీస్టార్స్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు.

Latest Updates