SBI గుడ్ న్యూస్: అన్ని ATMలలో నగదు

SBIదేశంలోని వివిధ ప్రాంతాల్లో నగదు కొరత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) చైర్మన్ రజనీష్ కుమార్ గురువారం(ఏప్రిల్-19) గుడ్ న్యూస్ చెప్పారు. శుక్రవారం(ఏప్రిల్-20) వరకు ఈ సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. నగదు కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు కరెన్సీ నోట్లను పంపిస్తున్నట్లు తెలిపారు.

అంతకుముందు వ్యవస్థలో నగదు కొరత రూ.70 వేల కోట్లు ఉన్నట్లు SBI  తెలిపింది.ATMల నుంచి నెలవారిగా డబ్బులు విత్ డ్రా చేసుకోవడంలో ఇది మూడో వంతు. 2018 ఆర్థిక సంవత్సరంలో రెండో ఆరు నెలల్లో డెబిట్ కార్డుల ద్వారా రూ.15.29 లక్షల కోట్లు విత్‌డ్రా చేసినట్లు ఓ నివేదిక చెప్తోంది. అంటే అంతకుముందు ఆరు నెలల్లో తీసుకున్న నగదు కన్నా ఇది 12.2 శాతం ఎక్కువ. నోట్ల రద్దు కన్నా ముందునాటి కరెన్సీ కన్నా ఎక్కువ కరెన్సీ ప్రస్తుతం చలామణిలో ఉందని ఆ నివేదికలో ఉంది.

Posted in Uncategorized

Latest Updates