అమరుల రుణాలు మాఫీ.. 30 లక్షల ఇన్సూరెన్స్‌: SBI

పుల్వామా దాడిలో అమరులైన ప్రతీ జవానుకు 30 లక్షల ఇన్సూరెన్స్‌ ను ఇవ్వనున్నట్లు SBI తెలిపింది. సోమవారం ఇందుకు ప్రకటన చేసింది. సైనికులందరికి SBI ఎకౌంట్ నుండే నగదు బదిలీ అవుతుందని తెలిపింది. అమరుల కుటుంబాలకు తొందరలోనే నగదును అందజేస్తామని చెప్పింది.

అమరులైన 40మంది సైనికులలో 23మంది SBI లో రుణంతీసుకున్నారని SBI చెప్పింది. ఆ రుణాన్ని కూడా రద్దుచేస్తున్నట్టు తెలిపింది. దీంతో పాటే బ్యాంకు ఉద్యోగులు స్వతహాగా అమరుల కుటుంబాలకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయాలని కోరింది. CRPF ఏర్పాటు చేసిన ‘భారత్ కే వీర్’ కు ఫండ్ ను పంపుతామని బ్యాంకు ఉద్యోగులు తెలిపారు.

Latest Updates