
30 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రాయితీ
ప్రాసెసింగ్ ఫీజులు 100% మాఫీ
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్లపై 30 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రాయితీ ఇచ్చింది. ప్రాసెసింగ్ ఫీజులపై 100 శాతం మాఫీని ప్రకటించింది. సిబిల్ స్కోర్‌తో కొత్త హోమ్ లోన్ వడ్డీ రేట్లు లింక్ అయి ఉంటాయని తెలిపింది. రూ.30 లక్షల వరకున్న లోన్లకు 6.80 శాతం నుంచి, రూ.30 లక్షల పైన లోన్లకు 6.95 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభమవుతాయని బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉమెన్ బారోవర్స్‌కు కూడా 5 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ ఉంటుందని తెలిపింది. గృహ కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన రాయితీలను ప్రకటించాలనే లక్ష్యంతో 30 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రాయితీని తీసుకొచ్చినట్టు చెప్పింది. ఈ వడ్డీ రాయితీ 8 మెట్రో సిటీల్లో రూ.5 కోట్ల వరకున్న లోన్లకు అందుబాటులో ఉంటుంది. యోనో యాప్ ద్వారా కస్టమర్లు ఈ లోన్ రాయితీకి అప్లయి చేసుకోవచ్చు. దీని ద్వారా అదనంగా 5 బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ వస్తుంది. 2021 మార్చి వరకు హోమ్ లోన్ కస్టమర్లకు రాయితీలను అందిస్తామని బ్యాంక్ మేనేజర్(రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి తెలిపారు. అర్హులైన హోమ్ లోన్ బారోవర్స్ యోనో యాప్ ద్వారా పేపర్‌లెస్ ప్రీఅప్రూవ్డ్ హోమ్ లోన్‌ను పొందవచ్చు.