SBI లో ఉద్యోగాల జాతర.. 2000 పీవో పోస్టులు

SBI బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు దేశ వ్యాప్తంగా రెండు వేల పోస్టులను భర్తీచేయనున్నారు. అర్హులైన వారు అప్లైయ్ చేసుకోవలసిందిగా అధికారులు కోరారు. ఏదైనా గుర్తింపుఉన్న యునివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయినవారు.. డిగ్రీ చివరి సంవత్సరం చదివి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంట్రెన్స్ టెస్ట్ రాయడానికి ఫీజును ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 22వరకు కట్ట వచ్చని తెలిపారు. ST, SC, దివ్యాంగులకు రూ.125 ఫీజును నిర్ణయించారు. OBC, EWS అభ్యర్థులకు రూ.750 లు చెల్లించాలి.

ప్రొబేషనరీ ఆఫీసర్ల పరీక్ష ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూన్‌లో ప్రిలిమినరీ, జులైలో మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. సెప్టెంబరులో ఇంటర్వ్యూలు నిర్వహించి.. అక్టోబరు నాటికి ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేయనున్నారు.

ఏజ్ లిమిట్..
01.04.2019 నాటికి 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.. రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఆన్ లైన్ ద్వారా అప్లైయ్ చేసుకోవాలి.

రిజర్వేషన్ వారిగా కెటాయించిన పోస్టులు:

ఎస్సీ   300

ఎస్టీ    150

ఓబీసీ 540

ఈడబ్ల్యూఎస్  200

జనరల్        810

మొత్తం పోస్టులు     2000

Latest Updates