గుడ్ న్యూస్.. వడ్డీ తగ్గించిన ఎస్‌‌బీఐ

న్యూఢిల్లీ: స్టేట్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా(ఎస్‌‌బీఐ) బుధవారం లోన్స్‌‌పై వడ్డీని, డిపాజిట్లపై రేట్లను తగ్గించింది. లోన్స్‌‌పై విధించే వడ్డీని తగ్గించడంతో ఎస్‌‌బీఐ హోమ్‌‌లోన్లు, ఆటోలోన్లు వంటి వాటికి చెల్లించే ఈఎంఐలు తగ్గనున్నాయి.  వివిధ టెన్యూర్లకు వర్తించేలా మార్జినల్‌‌ కాస్ట్‌‌ ఆఫ్‌‌ ఫండ్‌‌ బేస్డ్‌‌ లెండింగ్‌‌ రేట్‌‌(ఎంసీఎల్‌‌ఆర్‌‌‌‌)ను 15 బేసిస్‌‌ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఎంసీఎల్‌‌ఆర్‌‌తో లింక్‌‌ ఉండే లోన్స్‌‌పై చెల్లించాల్సిన వడ్డీ తగ్గుతుంది.   సవరించిన ఎంసీఎల్‌‌ఆర్‌‌‌‌ రేట్లు మంగళవారం(మార్చి 10)  నుంచి  అమలులోకి వచ్చాయి. ఏడాది ఎంసీఎల్‌‌ఆర్‌‌‌‌ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఈ రేటు 7.85 శాతం నుంచి 7.75 శాతం వరకు తగ్గింది. ఓవర్‌‌‌‌నైట్‌‌, వన్‌‌మంత్‌‌ ఎంసీఎల్‌‌ఆర్‌‌‌‌లు 15 బేసిస్‌‌ పాయింట్లు తగ్గి 7.45 శాతానికి తగ్గాయి. ఎస్‌‌బీఐ తమ మూడు నెలల ఎంసీఎల్‌‌ఆర్‌‌‌‌ను 7.65 శాతం నుంచి 7.50 శాతానికి సవరించింది. అదే రెండేళ్ల ఎంసీఎల్‌‌ఆర్‌‌‌‌ను 10 బేసిస్‌‌ పాయింట్లు తగ్గించి  7.95 శాతానికి సవరించింది. మూడేళ్ల ఎంసీఆర్‌‌‌‌10 బేసిస్‌‌ పాయింట్లు తగ్గి 8.05 శాతంగా ఉంది. యూనియన్‌‌ బ్యాంక్‌‌ కూడా తన ఎంసీఎల్‌‌ఆర్‌‌‌‌ రేట్లను ఇప్పటికే తగ్గించింది.

డిపాజిట్‌‌ రేట్లు తగ్గాయ్‌‌..

ఎస్‌‌బీఐ నెల రోజులలోపే  ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్ల(ఎఫ్‌‌డీ)పై  వడ్డీరేటును రెండోసారి తగ్గించింది. ఈ కొత్త రేట్లు మంగళవారం(మార్చి 10) నుంచే అమలులోకి వచ్చాయి. ఇందులో 46–179 రోజులు, 180–210 రోజులు,  211 రోజుల నుంచి ఏడాదిలోపు కాలవ్యవధి ఉండే డిపాజిట్‌‌ రేట్లను యధాతథంగానే ఉంచింది.

Latest Updates