వాట్సాప్ మోసం : కష్టమర్లకు ఎస్బీఐ సూచన

వాట్సాప్ నుంచి వచ్చే మెసేజ్ ల పట్ల అకౌంట్ హోల్డర్లు అప్రమత్తంగా ఉండాలంని  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీ చేసింది.

బ్యాంక్ అకౌంట్ల లో ఉన్న సొమ్మును కాజేసేందుకు సైబర్ క్రిమినల్స్ సిద్ధంగా ఉంటారని,  వాట్సాప్ నుంచి వచ్చే కాల్స్, మెసేజ్ ల పై జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ చేసింది.

సైబర్ నేరగాళ్లు కష్టమర్లను  మోసం చేసేందుకు వాట్సాప్ నుంచి లాటరీ తగిలిందని, ఓటీపీ చెబితే మీరు గెలుచుకున్న మనీ అకౌంట్లలో పడిపోతుందని కాల్స్, మెసేజ్ లు సెండ్ చేస్తారని తెలిపింది. అలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే ఎవరూ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్స్, ఓటీపీ లు షేర్ చేయోద్దని సూచించింది.

బ్యాంక్ అకౌంట్ వివరాలు కావాలని ఎస్బీఐ ఎప్పుడూ ఈమెయిల్, ఎస్ఎంఎస్, కాల్స్, వాట్సాప్ కాల్స్ చేయదని ఎస్బీఐ ట్వీట్ లో పేర్కొంది.

 

Latest Updates