మొహర్రం ప్రదర్శనల పర్మిషన్‌కు సుప్రీం నో!

న్యూఢిల్లీ: మొహర్రం ప్రదర్శనలపై వేసిన పిల్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దేశవ్యాప్తంగా మొహర్రం ప్రదర్శనలకు అనుమతినిచ్చేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. దేశం మొత్తానికీ వర్తించేలా సాధారణ ఆదేశాలను ఏవిధంగా జారీ చేయగలమని సుప్రీం ప్రశ్నించింది. ‘దేశమంతటికీ వర్తించే విధంగా అనుమతులు ఇవ్వడం కుదరదు. ఇది గందరగోళాన్ని సృష్టిస్తుంది. కరోనా వ్యాప్తికి ఒకే కమ్యూనిటీనే టార్గెట్‌ చేస్తారు. దీన్ని మేం కోరుకోవడం లేదు’ అని సీజేఐ ఎస్‌ఏ బోబ్డే అధ్యకత వహించిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఒక కోర్టుగా ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టాలనుకోవడం లేదని అపెక్స్ కోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను ఉత్తర్‌‌ప్రదేశ్‌కు చెందిన షియా నాయకుడు సయ్యద్ కల్బే జావేద్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌తోపాటు మొహర్రం ప్రదర్శనలపై అనుమతి కోరుతూ మరో పిటిషన్‌ కూడా సుప్రీంలో దాఖలైంది.

Latest Updates