అనిల్ అంబానీకి సుప్రీం ఆదేశం : డబ్బు చెల్లించకపోతే జైలు శిక్షే..

ఢిల్లీ : కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేలారు ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ. స్వీడన్ కు చెందిన ఎరిక్సన్ కంపెనీకి నాలుగు వారాల్లోగా రూ.453 కోట్లు చెల్లించకపోతే… అనిల్ అంబానీ 3 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది సుప్రీంకోర్టు. అనిల్ అంబానీ అహంకారపూరితంగా ప్రవర్తించారని కోర్టు సీరియస్ అయింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి కోటి రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.

Latest Updates