చిదంబరానికి సుప్రీంలో ఎదురుదెబ్బ

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) నమోదు చేసిన INX మీడియా కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ఇవాళ(బుధవారం) తిరస్కరించింది.

ఆర్థిక నేరాల్లో మాత్రమే అత్యంత అరుదుగా ముందస్తు బెయిల్‌ను ఉపయోగించుకోవాలని, వాస్తవాలను, పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఈ కేసు ముందస్తు బెయిల్‌ పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు తెలిపింది. దీనితో ఇప్పటికే 15 రోజులపాటు CBI కస్టడీలో గడిపిన చిదంబరంను ED అరెస్టు చేసే అవకాశం ఏర్పడింది. దర్యాప్తు చేస్తున్న సంస్థలు తమ దర్యాప్తును కొనసాగించడానికి వీలుగా స్వేచ్ఛనివ్వాలంది కోర్టు. ఈ సమయంలో ముందస్తు బెయిల్‌ ఇవ్వడంతో దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిందితుడు సంబంధిత కోర్టులోనే రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కూడా కోర్టు చిదంబరానికి సూచించింది.

Latest Updates