ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంలో ఏపీకి ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లిష్‌ మీడియం అమలు విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో ఎస్‌ఎల్‌పీ, స్టేపై ప్రతివాదులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తర్వాత తదుపరి విచారణను ఈనెల 25కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన జీవో నెం.81, 85ను హైకోర్టు కొట్టేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది ఏపీ ప్రభుత్వం. దీనిపై సుప్రీంకోర్టు విచారించి స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ చ‌ర్య జాతీయ విద్యా విదానానికి వ్య‌తిరేకంగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది.

Latest Updates