ఎన్ కౌంటర్ పై NHRC, హైకోర్టు విచారణ ఆపేయండి

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై  త్రిసభ్య కమిషన్ ను వేసిన సుప్రీం కోర్టు ఇతర దర్యాప్తు సంస్థల విచారణ నిలిపివేయాలని సూచించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎలాంటి విచారణ చేయొద్దని సూచించింది.

ఎన్ కౌంటర్ పై ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు న్యాయవాది ముకుల్ రోహత్గి. ఎన్ కౌంటర్ పై ఇప్పటికే సిట్ విచారణ జరుపుతుందని.. విశ్రాంత న్యాయమూర్తితో మళ్లీ విచారణ ఎందుకని అడిగారు. అయితే ఎన్ కౌంటర్ పై పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురుకాల్పులు జరిపారా? లేక కావాలని బూటకపు ఎన్‌కౌంటర్ చేశారా? అన్నది తెలియాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అర్వింద్ బోబ్డే అన్నారు. ఇందుకోసం జ్యుడిషియల్ ఎంక్వైరీకి కమిషన్ వేస్తున్నట్లు చెప్పారు. ఈ కమిషన్ సుప్రీం మాజీ న్యాయమూర్తి సిర్పూర్కర్ నేతృత్వం వహిస్తారని చెప్పారు. 

సుప్రీం జుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలని నిర్ణయిస్తే ఇతర దర్యాప్తు సంస్థల విచారణ ఆపేయాలన్న ముకుల్ రోహత్గి వాదనతో ఏకీభవించింది సుప్రీం  కోర్టు. ఎన్ కౌంటర్ పై సుప్రీం  విచారణ జరిపిస్తున్నపుడు ఎన్ హెచ్ ఆర్సీ, హైకోర్టు  విచారణ అవసరం లేదని సూచించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు  ఎన్ కౌంటర్ పై  ఎలాంటి దర్యాప్తు  చేయొద్దని సూచించింది.

Latest Updates