ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మిస్ యూస్: రిటైర్డ్ IPS, IASల పై కేసు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను మిస్ యూస్ చేసి  తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన కేసుల్లో కొందరు రిటైర్డ్ IPS, IASల పై కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు ఆదేశాలతో ఇద్దరు IPSలు , నలుగురు IASలపై కేసు నమోదు చేశారు సైఫాబాద్ పోలీసులు. రిటైర్డ్  IPSలలో దినేష్ రెడ్డి, C.S.R.K. L.N రాజుపై కేసు నమోదైంది. రిటైర్డ్ IASలలో ఎస్వీ ప్రసాద్, పీకే మహంతి, రత్న ప్రభ, విద్యాసాగర్ లపై కేసులు రిజిస్టర్ అయ్యాయి. కేంద్రానికి తప్పుడు నివేదిక పంపడంపై బాధితురాలు నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. కేసుపై విచారణ జరిపిన కోర్టు… బాధ్యులైన రిటైర్డ్ IPS ,IASలపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

Latest Updates