ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

TDP నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎస్సీలను కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ ఈ యాక్షన్ తీసుకుంది. కింది జాతి అంటూ అవమానించారని అనిల్ అనే వ్యక్తి…ఢిల్లీలోని జాతీయ ఎస్సీ కమిషన్ లో చింతమనేనిపై ఫిర్యాదు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో ఎమ్మెల్యే చింతమనేని పాల్గొన్న ఓ సభలో ‘ మీరు ఎస్సీలు(దళితులు).. మీకెందుకురా రాజకీయాలు..’ అంటూ మాట్లాడినట్టుగా ఉన్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో  వైరల్ అయింది. గత నెలలో తన నియోజకవర్గంలో మాట్లాడుతూ… ఆయన అనుచిత మాటలు మాట్లాడినట్టు ఆయనపై విమర్శలు వచ్చాయి. కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎస్సీ సంఘాలు సీరియస్ అయ్యాయి. ఇవన్నీ ఆరోపణలే అని.. వాస్తవం కాదని… ఎమ్మెల్యే వాటిని ఖండించారు. ఐతే…. తమకు అందిన ఫిర్యాదుతో జాతీయ ఎస్సీ కమిషన్ … ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసింది.

Latest Updates