ఐఐటీల్లో పీహెచ్​డీ చేస్తున్న ఎస్సీ, ఎస్టీల సంఖ్య తక్కువ

ఎస్సీ, ఎస్టీ స్కాలర్లు ఐఐటీల్లో అంతంతే

న్యూఢిల్లీ: ఐఐటీల్లో పీహెచ్​డీ చేస్తున్న ఎస్సీ, ఎస్టీల సంఖ్య తక్కువని, రిజర్వేషన్​ కోటా కూడా పూర్తి కావడంలేదని అధికారిక డాటా ఒకటి వెల్లడించింది. పీహెచ్​డీ కోర్సుల్లో చేరే ఎస్సీ, ఎస్టీలు అతికొద్దిమందేనని చెప్పింది. 2015 నుంచి 2019 మధ్య కాలంలో  దేశంలోని 23 ఐఐటీల్లో 25,007 మంది పీహెచ్​డీ స్కాలర్లు చేరితే .. వీరిలో ఎస్సీలు 9.1% మంది, ఎస్టీలు 2.1% మంది ఉన్నారు. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లు  ఉన్నా  ఆ మేరకు ఈ వర్గాలు ఐఐటీల్లో పీహెచ్​డీకి ఎన్​రోల్​కావడంలేదని రాజ్యసభలో సర్కార్​ డేటాను వెల్లడించింది. ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అమలవుతుండగా  23.2% మంది  డాక్టొరల్​ లెవల్​ కోర్సులో చేరారు.  జనరల్​ కేటగిరీ స్టూడెంట్స్ ​మాత్రం  65.6% పీహెచ్​డీ కోర్సుల్లో చేరారు.

Latest Updates