జీసస్ నడిచిన మెట్లంటూ క్యూ కడుతున్న క్రిస్టియన్లు

  • వాటికన్ లో సందర్శనకు‘స్కాలా శాంటా
  • ’300 ఏళ్ల తర్వాత అసలుమెట్లపై నడిచే అవకాశం
  • ప్రపంచవ్యాప్తంగా క్యూ కడుతున్న క్రిస్టియన్లు
  • జీసస్ ఆ మెట్లపై నడవలేదన్నఆర్కియాలజిస్టులు

28 మెట్లు. 28 అడుగులు. గుండెల్లోమోయలేని బాధ. అడుగు అడుగునాకన్నీటి బొట్లు. రక్తపు చుక్కలు పడిన మూడు మెట్లకు ఇచ్చే ముద్దుతో పులకరించే ఒళ్లు. దేవుడు నడిచిన బాటలో ఉన్నామనే ఆత్మ సంతృప్తి. నడక తప్పటడుగులతో మొదలైతే, జీవితం ‘స్కాలా శాంటా ’పైనడవడం వల్ల సార్థక మవుతుందని ప్రతి క్రిస్టియన్ నమ్మకం. స్కాలా శాంటా ‘శిలువ’ శిక్షకు ముందు విచారణను ఎదుర్కొంటూ ఏసు క్రీస్తు నడిచినమెట్లు. దాదాపు 300 ఏళ్ల తర్వాత పోయిన వారంరోమ్ లో అసలైన పాలరాతి మెట్లపై నడిచే అవకాశం వచ్చింది. స్కాలా శాంటా వాటికన్ సిటీలో ఉంది. ఏసు క్రీస్తు నిజంగానే ఈ 28 మెట్లపై నడిచారా అన్నదానిపై భిన్న వాదనలు ఉన్నాయి . పురాణాల ప్రకారం స్కాలా శాంటా జెరూసలేం లోని ప్రటోరియం ప్యాలెస్లో ఉండేవి. ఈ ప్యాలెస్ ను ఏసుకు శిక్ష విధించిన పాంటియాస్ పైలెట్ వాడే వాడు. విచారణ కోసం ఏసును ఆఫీసర్లు ప్రటోరియం ప్యాలెస్ కు తెచ్చే వారు.ప్యాలెస్ లోపలికి వెళ్లా లంటే స్కాలా శాంటా మెట్లపై నడవాల్సివుంటుంది. అప్పటికే చిత్ర హింసలకు గురై న ఏసు అతి కష్టం పై ఈ మెట్లను ఎక్కేవారు. అలా నడుస్తున్నప్పుడు ఓ రోజు ఆయన రక్తపు చుక్కలు మూడు మెట్లపై పడ్డాయి. అలా చాలా సార్లు స్కాలాశాంటా గుండా నడిచారు.

కొద్ది రోజుల తర్వాత ఏసుక్రీస్తుకు శిలువ వేయాలని పాంటియాస్ పైలెట్ తీర్పుచెప్తాడు. ఇది జరిగిన కొన్ని వందల ఏళ్ల తర్వాతరోమన్ చక్రవర్తి కాన్ స్టాంటైన్ తల్లి హెలెనా(306నుం చి 337 సంవత్సరాల మధ్య) జెరూసలేంను సందర్శించారు. తిరిగి వస్తూ ప్రటోరియం ప్యాలెస్లోని స్కాలా శాంటాను రోమ్ కు తెచ్చా రనేది వాటిసారాం శం. అప్పటి నుంచి స్కాలా శాంటా పై మోకాళ్లపై నడవడం ఆనవాయితీగా మారిం ది. మూడుమెట్లపై ఏసు రక్తపు చుక్కలు పడిన చోట శిలువ వేసి ఉంటుంది. సందర్శకులు ఆ శిలువలను ముద్దాడి తరిస్తారు. వందల ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కాలం గడుస్తున్న కొద్దీ పాలరాతి మెట్లు దెబ్బతినడం మొదలుపెట్టాయి . దీంతో వాటి రక్షణకుమెట్లపైన చెక్కను అమర్చా రు. ఇప్పుడు రిపేర్ల తర్వాత మళ్లీ వాటిని తీసేశారు. వచ్చే జూన్ వరకూ అసలైన మెట్లపైనే నడిచేందుకు అనుమతిస్తారు.

జీసస్ ఆ మెట్లపై నడవలేదు: ఆర్కియాలజిస్టులు

ఏసు క్రీస్తు కు శిలువ వేసిన సమయంలో ఇజ్రాయెల్ పాలస్తీనాల్లో అసలు పాలరాయే లేదని చరిత్రకారులు అంటున్నారు. స్కాలా శాంటా పిలుస్తు న్న మెట్లు అసలు పాంటిస్ పిలేట్ కు చెందిన ప్యాలెస్ లోనివి కావని చెబుతున్నారు. రోమన్లు క్రీ.శ 70 సంవత్సరంలో ప్రటోరియం ప్యాలెస్ ను నేలమట్టం చేశారని నార్త్ కరోలినా యూనివర్సిటీ ఆర్కియాలజిస్టు చాపెల్ హిల్ పేర్కొన్నారు. కింగ్ హెరాడ్ ప్రటోరియం ప్యాలెస్ ను కట్టిం చారని, ఆయన రాజ్యం లో పాలరాయితో కట్టిన కట్టడాలేవీ లేవని చెప్ పారు. క్రీ.శ 70, అంతకంటే ముందు పాలస్తీనాలో పాలరాతి నిర్మాణాలు జరగలేదని తెలిపారు. కింగ్ హెరాడ్ కట్టిం చిన కట్టడాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుందన్నారు. ఇటీవల హెరాడ్ మౌసోలియం బయటపడిందని, స్థా నికంగా దొరికే సున్నపు రాయితోనే దాన్ని కట్టారని వివరించారు

Latest Updates