అది హర్షద్ మెహతా 1992 స్కామ్ అయితే.. ఇది అరోన్ ఫించ్ 2020 ఐపీఎల్ స్కామ్

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ సెంచరీ చేయగా మ్యాక్స్ వెల్ 45 పరుగులు చేసి జట్టు భారీస్కోర్ కు పునాది వేశారు. అయితే ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్లు 2020 ఐపీఎల్ సీజన్ లో ఘోరంగా విఫలమవ్వడంపై మీమ్స్ క్రియేటర్స్  ఇటీవల విడుదలైన వెబ్ సిరిస్ స్కామ్ 1992ను ఐపీఎల్ –2020తో పోల్చుతూ ట్రోల్ చేస్తున్నారు.

1992సంవత్సరంలో హర్షద్ మెహతా రూ.5వేల కోట్ల స్కామ్ చేస్తే..ఐపీఎల్ 2020లో అరోన్ ఫించ్, మ్యాక్స్ వెల్  ఘోరంగా విఫలమైన ఆటతో ఐపీఎల్ ‌‌2020 స్కామ్ కు పాల్పడ్డారంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఐపీఎల్ 2020 అరోన్ పింఛ్ ఆర్సీబీ తరుపున 12మ్యాచ్ ల్లో ఆడి కేవలం 268 రన్స్ చేశాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరుపున ఆడిన మ్యాక్స్ వెల్ 13 మ్యాచ్ ల్లో 108పరుగులు చేయడంపై మీమ్స్ క్రియేటర్స్ చెలరేగిపోతున్నారు. అది హర్షద్ మెహతా 1992 స్కామ్ అయితే..ఇది అరోన్ ఫించ్, మ్యాక్స్ వెల్  2020 ఐపీఎల్ స్కామ్ అంటూ మీమ్స్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

 

Latest Updates