ఆన్ లైన్ మార్కెటింగ్ పేరుతో మోసాలు.. ముఠాను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

నిందితులందరూ వైజాగ్ వాసులు.. చదివింది ఇంటర్

హైదరాబాద్: ఆన్ లైన్ మార్కెటింగ్ ,ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు సభ్యులు గల ఈ ముఠాను అరెస్ట్ చేసిన సందర్బంగా గచ్చిబౌలి సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించారు. యూకే కంపెనీ పేరుతో అమాయకులకు వల విసిరి డబ్బులు వసూలు చేసి మోసం చేయడమే పనిగా పెట్టుకునారు. ఈ నలుగురు నిందితులు వైజాగ్ కు చెందిన వారిగా తేలింది. ఇంటర్ మీడియట్ చదువిన వీరంతా వెబ్ సైట్ లో ఒక అడ్వైజ్మెంట్ లో చూసి.. మోసాలకు దిగారు. ముందుగా స్టెమ్ కోర్ మాక్స్ హెడ్జ్ పేరుతో వెబ్సైట్ ను స్టార్ట్ చేశారు..  ఆ తర్వాత యూకే కంపెనీ పేరుతో  ప్రచారం చేసుకుంటూ 10వేల నుంచి లక్ష వరకు స్కీం లు పెట్టారు. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రతి రోజు 5 శాతం కమీషన్  వస్తుంది అంటూ ఆశ పెట్టారు. పెట్టుబడి పెట్టిన వారు ఎవరినైనా రెఫరల్ చేసి పెట్టుబడి పెట్టిస్తే 10 శాతం కమిషన్ ఇస్తామన్నారు. ఇది అంతా ఆన్ లైన్ కంపెనీ అనడంతో చాలా మంది నమ్మారు. సుమారు 2500 మంది దగ్గర 7 కోట్లు వసూలు చేసింది ఈ ముఠా.  టెక్నాలజీని వాడుకొని మోసం చేశారు. నిందితుల నుంచి 58 లక్షల రూపాయల నగదు, భూమి డాక్యుమెంట్స్, ఒక లాప్ టాప్, 4 సెల్ ఫోన్లు, 2కార్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ సజ్జనార్ వివరించారు.

Latest Updates