వాట్సాప్ కొత్త ఫీచర్: స్కాన్ చేస్తే నంబర్ సేవ్

ప్రముఖ మెసేంజ్ యాప్ వాట్సాప్ ఎప్పుడూ తన యూజర్ల కోసం అప్ డేట్ చేస్తుంటుంది.  రకరకాల సదుపాయాలను అందుబాటులోకి తెస్తంటంది. ఇందులో భాగంగా లేటెస్టుగా మరో ఫీచర్ తెచ్చింది. దీని ద్వారా ఇక నుంచి కొత్త కాంటాక్ట్ నంబర్లను మొబైల్ లో టైపు చేయకుండానే యాడ్ చేసుకోవచ్చు. కేవలం స్కాన్ చేసి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఫీడ్ చేసుకునే అవకాశం కల్పించింది.

కొన్నిసార్లు కొత్త నంబర్లను యాడ్ చేసుకోవడం కోసం ఇబ్బందులు పడుతుంటాము. ఒక నంబర్ తప్పుగా ప్రెస్ చేసినా ఎవరిదో నంబర్ ఫీడ్ అవుతుంది. ఇకపై అలాంటి పొరపాట్లు…ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ..ఈజీగా నంబర్ యాడ్ చేసుకునేందుకు కొత్త ఫీచర్ ను యూజర్ల కు అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. దీని కోసం మనం ఎవరైతే నంబర్ యాడ్ చేసుకోవాలో వాళ్ల వాట్సాప్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. వెంటనే ఆ నంబర్ కాంటాక్ట్ లో చేరిపోతుంది. దీంతో మ్యానువల్‌గా టైప్‌ చేస్తే జరిగే పొరపాట్లను అరికట్టవచ్చు. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్‌లోనే ఉంది. అతి త్వరలోనే యాజర్లందరికి అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది వాట్సాప్.

Latest Updates