కరోనా ఎఫెక్ట్ : ఇచ్చినట్లే ఇచ్చి..ఐఐటీ జాబ్ ఆఫర్లు వెనక్కి

కరోనా వైరస్ వల్ల రాబోయే రోజుల్లో వాణిజ్య రంగాల్లోనే కాకుండా ఉద్యోగ రంగాల్ని సైతం అగాధంలోకి నెట్టేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్ధిక రంగంపై ప్రభావం చూపడంతో ఉద్యోగుల తొలగింపు, ఉద్యోగుల జీతాల్లో కోత ఉంటున్నట్లు తెలుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ పీల్డ్ సర్వీసెస్ కంపెనీ ష్లూంబెర్గర్  ఐఐటీ గ్రాడ్యుయేట్లకు ఇచ్చిన జాబ్ ఆఫర్లను వెనుకకు తీసుకున్నది.

ఐఐటీ, ఐఐఎంలలో చదివితే బ్రహ్మాండమైన జీతాలతో టాప్ జాబ్ ఆఫర్లు వస్తాయని అందరికీ తెలిసిందే. అలా వచ్చిన ఐఐటీ జాబ్ ఆఫర్లలో కొన్ని కరోనా కారణంగా వెనకకు వెళ్లాయి.

ష్లూంబెర్గర్ ఇటీవల జూనియర్ ఫీల్డ్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు  ఐఐటి -ఢిల్లీ, ఐఐటి -బొంబాయి, ఐఐటి-కాన్పూర్, ఐఐటి-మద్రాస్ విద్యార్ధులకు భారీ ఆఫర్లు ప్రకటించింది. కానీ ఇప్పుడు  ఆఫర్లను వెనుకకు తీసుకోవడంపై తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే  పరిస్థితులు మెరుగుపడగానే విద్యార్థులను సంప్రదిస్తామని కంపెనీ తెలిపింది. మరిన్ని రిక్రూట్ మెంట్లు చేయడం ప్రస్తుత ఉద్యోగుల సంక్షేమానికి అంత మంచిది కాదని కంపెనీ  ప్రతినిధులు చెప్పారు.

Latest Updates