స్కూల్ ఆటోకు యాక్సిడెంట్.. తప్పతాగి నడిపిన డ్రైవర్

హైదరాబాద్ : మద్యం మత్తులో విద్యార్థులను ఆటోలో తీసుకెళ్తూ యాక్సిడెంట్ చేశాడు ఓ డ్రైవర్. ఈ సంఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు.

అబిడ్స్ గన్ ఫౌండ్రిలోని రోజరి కాన్వెంట్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వాటర్స్ ముందు కారును ఢీ కొట్టాడు ఆటో డ్రైవర్. దీంతో.. ఆటోలోని ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. వీరిని స్థానిక హాస్పిటల్ కు తీసుకెళ్లారు నారాయణ గూడ పోలీసులు.

అధిక మోతాదులో మద్యం తాగిన ఆటో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates