ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: స్కూల్ పిల్లల ఆటో.. ఒకరిపై ఒకరిని కుక్కి

ఆర్టీసీ సమ్మె మొదలై నేటికి 18రోజులు అవుతుంది. అక్కడక్కగా ప్రైవేటు డ్రైవర్లతో, కండక్టర్లతో బస్సులు నడుపుతున్నా… పలు చోట్ల యాక్సిడెంట్స్ జరుగుతుండటంతో బస్సులు ఎక్కడానికి బయపడుతున్నారు ప్రయాణికులు. అయితే… ఆర్టీసీ బస్సులు ఎప్పటిలాగే… రోడ్ల మీదకు రాకపోవడంతో ఉద్యోగులు, స్కూల్ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం రామాంతపూర్ లో  హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పిల్లలు ఓ ఆటోలో ఫుల్ గా ఒకరిపై ఒకరు కూర్చుని వెళ్తున్నారు. బస్సులు నడవకపోవడంతో ఆటోలో వెళ్లాల్సివస్తుందని తెలిపారు విద్యార్థులు. ఆర్టీసీ సమ్మె ఇలాగే కొనసాగితే స్కూల్ కు వెళ్తేందుకు ప్రాబ్లమ్ అవుతుందని అన్నారు.

Latest Updates