అయ్యప్పమాలతో స్కూలుకెళ్లిన విద్యార్థి సస్పెండ్

అయ్యప్పమాల వేసుకుని స్కూల్ కు వచ్చాడంటూ ఓ స్టూడెంట్ ను సస్పెండ్ చేసింది స్కూల్ యాజమాన్యం. ఈ ఘటన  యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. భువనగిరిలోని ఇండియన్ మిషన్ హై స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న ప్రణీత్ రెడ్డి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు. అయితే మాలతో  స్కూల్ కు రావొద్దంటూ  41 రోజుల పాటు సస్పెండ్ చేశారు ప్రిన్సిపాల్. దీంతో స్కూల్ ముందు అయ్యప్ప భజన మండలి, విశ్వహిందూ పరిషత్ నిరసనకు దిగారు. ఈ నిరసనలో 50 మంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

More News

యువతిని వెంబడించిన పోకిరీలపై కేసు
దిశ ఘటనపై అసభ్యకర పోస్ట్ లు చేసిన వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్‌లో అక్కడ దెయ్యాలున్నాయట!

Latest Updates