స్కూల్ నుంచి విద్యార్థుల పరార్‌

పోలీసులకు ఫిర్యా దు చేసిన ప్రిన్సిపాల్‍

వికారాబాద్‍ జిల్లా వెలుగు: వికారాబాద్‍ జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు పారిపోయారని చోన్గోముల్ పోలీసులకు శనివారం ఫిర్యా దు అందింది. పూడూరు మండలం మన్నెగూడలోని కేశవరెడ్డి స్కూల్ లో 8వతరగతి చదివే విద్యార్థులిద్దరు పరారయ్యా రు. జిల్లా కేంద్రంలోని ఎన్నె పల్లికి చెందిన ప్రశాంత్‍, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందాడకు చెందిన కార్తీక్ స్కూల్  గోడదూకి పారిపోయినట్టు ప్రిన్సిపాల్  రాముకిషోర్  పోలీసులకు ఫిర్యా దు చేశారు. గురువారం సాయంత్రం విద్యార్థులు ఆడుకుంటు న్న సమయంలో వీరిద్దరు ప్రహరీ గోడదూకి పారిపోయారని తోటి విద్యార్థులు చెప్పారన్నారు. ఆరా తీస్తే ఆచూకీ దొరకలేదని, దాంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిం చినట్టు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి చోన్గో ముల్‍ పోలీస్ స్టేషన్ లో ఫిర్యా దు చేశామన్నారు. మన్నెగూలోని సీసీ కెమెరాల్లో పరిశీలిం చగా, బస్టాండ్లో కనిపిం చారని తర్వాత అక్కడ నుంచి ఎటు వెళ్లారో రికార్డు కాలేదన్నారు. కేసు నమోదు చేసి దర్యా తు చేస్తున్నట్టు ఎస్సై అరుణ్ కుమార్‍ చెప్పారు.

Latest Updates