ఇద్దరు కవలలతో సహా మొత్తం ఫ్యామిలీని చంపిన బాలుడు

16 ఏళ్ల కుర్రాడు.. సొంత ఫ్యామిలీని అడ్డంగా నరికి చంపాడు. అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, ఇద్దరు తమ్ముళ్లను దారుణంగా చంపాడు. ప్రపంచాన్నే కదిలించిన ఈ దారుణ సంఘటన పశ్చిమ రష్యాలోని ప్యాట్రికీవో ప్రాంతంలో జరిగింది.

వివరాలు.. పశ్చిమ రష్యాలోని ప్యాట్రికీవో ప్రాంతంలో నివసిస్తున్న తిముర్‌ అనే బాలుడు అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. అతడి తండ్రి విడాకులు తీసుకోవడంతో తల్లి మారినాతో కలిసి అమ్మమ్మ ఇంట్లోనే ఉంటున్నాడు. తనకు అమ్మమ్మ లిదియా (69), తాతయ్య విక్టార్ (66) అంటే చాలా ఇష్టం. తిమూర్‌ కు సోఫియా(4), ఆంటోన్ (4) అనే ఇద్దరు కవల తోబుట్టువులు కూడా ఉన్నారు.

తిమూర్ తల్లి.. తనకంటే సోఫియా, ఆంటోస్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని తిమూర్ ఈర్ష్య పడేవాడు. పైగా, అతడితో వారికి సేవలు చేయిస్తుందనే కోపం ఎక్కువైంది. దీంతో కవలల దగ్గర నిద్రపోతున్న తల్లి మారీనాను గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ తర్వాత సోఫియా, ఆంటోస్‌ లను కూడా నరికేశాడు. వీరి అరుపులు విని వచ్చిన అమ్మమ్మ, తాతయ్యను కూడా చంపేసి అక్కడి నుంచి వెళ్లి పోయాడు. ఉదయం స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. వారిని నరికిన గొడ్డలి ఆధారంగా పోలీసులు కుక్కలతో ఆ బాలుడి ఆచూకిని కనిపెట్టారు.

ఎందుకు చంపావని బాలుడిని పోలీసులు విచారించగా.. అమ్మమ్మ, తాతయ్యలంటే తనకు చాలా ఇష్టమని, వారిని చంపాలనే ఉద్దేశం తనకు లేదని తిమూర్ చెప్పాడు. అమ్మ కేకలు విని లోపలికి వచ్చిన అమ్మమ్మ, తాతయ్యలు ఏడ్వడం చూసి.. తనకు బాధ వేసిందని, వాళ్లు చనిపోయారనే బాధతో మరింత కుమిలిపోతారని జాలేసిందన్నాడు. దీంతో వారిని కూడా చంపేశానని తెలిపాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకోడాని టవర్ మీద నుంచి దూకేశానన్నాడు. తిమూర్ స్కూల్‌లో చాలా తెలివైన కుర్రాడిగా పేరు తెచ్చుకున్నాడని, ప్రతి పోటీలో అతడే ముందుండేవాడని స్కూల్ యాజమాన్యం తెలిపింది. అతడు ఈ హత్యలు చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదన్నారు.

తిముర్‌ ప్యామిలీ ఫొటోలు..

Latest Updates