క్రికెట్ కంటే పిల్లల చదువులే ముఖ్యం: కపిల్ దేవ్

ఫండ్స్ ఇవ్వడానికి మతపర సంస్థలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయని వ్యాఖ్య
న్యూఢిల్లీ: కరోనా కారణంగా మూసివేసిన స్కూళ్లు, కాలేజీలను ఎప్పుడు తెరుస్తారనేది చాలా ముఖ్యమని లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ చెప్పాడు. ఇప్పుడు క్రికెట్ ఒకటే సమస్య కాదని.. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లని పిల్లల గురించి తాను దిగులు చెందుతున్నానని పేర్కొన్నాడు. పిల్లలు మన యంగ్ జనరేషన్ అని.. స్కూల్స్, కాలేజీలు మొదట రీఓపెన్ అవ్వాలని వివరించాడు. కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా ఫండ్ రైజింగ్ కోసం ఇండియా–పాకిస్తాన్ మూడు వన్డేల సిరీస్ నిర్వహించాలని రీసెంట్ గా పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. దీనిపై హర్యానా హరికేన్ స్పందించాడు. ‘ఇండియా–పాక్ మ్యాచ్ లు ఆడాలని మీరు ఎమోషన ల్ గా చెప్పొచ్చు. ప్రస్తుత తరుణంలో మ్యాచ్ లు ఆడటం ముఖ్యం కాదు. మీకు మనీ కావాలంటే బార్డర్ దగ్గర యాక్టివిటీస్ (పాక్ ను ఉద్దేశించి) ఆపాలి. మాకు డబ్బులు అవసరమైతే ఇవ్వడానికి మతపరమైన పుణ్య క్షేత్రాలు, సంస్థలు ఉన్నాయి. వాళ్లు ముందుకొచ్చి ఇస్తారు. అది వాళ్ల బాధ్యత. మేం అక్కడ దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు చాలా డబ్బును ఇస్తాం. అందుకే వాళ్లు గవర్నమెంట్ కు సాయం చేయాలి’ అని కపిల్ పేర్కొన్నాడు.

Latest Updates