మెదడుకు చావు కాస్త లేటు

Science Is Starting to Explore the Gray Zone Between Life and Death
  • మరణం తర్వాతా దాని కణాలు యాక్టివ్
  • చావుకు మెదడులో పెద్ద ‘గ్రే జోన్ ’.. తల తెగినా జీవం
  • చనిపోయిన పందుల మెదడు కణాలకు పునరుత్తేజం
  • చావు ఓ పెద్ద ప్రాసెస్ అంటున్న అమెరికా సైంటిస్టులు

మరణానికి డెఫినేషన్ ఏంటి? టెక్నికల్ గా అయితే ఊపిరాగిపోవడం.. గుండె కొట్టుకోకపోవడం!  ఇదే అందరికీ తెలిసిన ప్రాథమిక నిర్వచనం. ఇప్పుడు ఊపిరి తీసుకోలేకపోతే.. బయటి నుంచి గాలినందించే వెంటిలేటర్లున్నాయి. గుండె పనిచేయకపోతే మళ్లీ కొట్టుకునేలా చేసే సీపీఆర్ యంత్రాలొచ్చాయి. మరి, బ్రెయిన్ డెడ్ పేషెంట్లలో ఆ మెదడును మళ్లీ బతికించే యంత్రాలొచ్చాయా అంటే నో అనే ఆన్సర్ వస్తుంది . బ్రెయిన్ డెత్ అనే కాన్సెప్ట్​ను అమెరికా,ఇండియా సహా చాలా దేశాల్లో వాడుతున్నారు . కానీ,కొన్ని దేశాలు మాత్రం గుండె కొట్టుకుంటున్నా,ఊపిరి తీసుకుంటున్నా, అన్ని అవయవాలు (మెదడు తప్ప) సరిగ్గా పనిచేస్తున్నా దానిని మరణం కింద ఎట్లలెక్కగడతామంటూ వాదిస్తున్నాయి. దీనిపైనే పెద్ద చర్చ నడుస్తోంది . ఇప్పుడు ఇంకో చర్చ మొదలైంది .మొదటి చర్చకు పూర్తి భిన్నమైన చర్చ ఇది. ఏంటది..? అంటే టెక్నికల్ గా చచ్చిపోయినా మెదడు మాత్రం చచ్చిపోదట. చావుకు సంబంధించి మెదడులో ఓపెద్ద ‘గ్రే జోన్ ’ ఉంటుందట. అది చాలా సేపు యాక్టివ్ గా ఉంటుందట. చనిపోయినా మెదడు కణాలను మళ్లీ ఉత్తేజ పరచొచ్చట. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన న్యూరో సైంటిస్టులు ఇదే మాట చెబుతున్నారు . పందులపై పరిశోధన చేశారు.

పందుల మెదళ్లకు పునరుత్తేజం?

అమెరికా ప్రభుత్వ అనుమతి ఉన్న కబేళాల్లో చంపిన పందుల మెదళ్లను సైంటిస్టులు సేకరించారు . అవి చనిపోయి నాలుగు గంటలయ్యాక ఆ మెదళ్లను ,కృత్రిమ రక్తం లాంటి పోషక ద్రావణాలను పంప్ చేసే యంత్రానికి కనెక్ట్​ చేశారు. మెదడు కణాల పనితీరును పరిశీలించారు . చనిపోయి గంటలు గడిచినా మెదడులో రక్త ప్రసరణను, మెదడు కణాల కార్యకలాపాలను పునరుద్ధరించొచ్చని గుర్తించారు . గుండెకొట్టుకోవడం ఆగి చనిపోయినా.. మెదడు చనిపోవడానికి చాలా టైం తీసుకుంటుందని, అదో పెద్ద ప్రాసెస్ అని వివరించారు . చావు అనేది కనురెప్ప వేసినంత ఈజీ కాదన్నారు. తల తెగ నరికినా ఓ శరీరం వెంటనే చచ్చుబడి పోదని, ఆ బాడీకి సరైన రక్తప్రసరణ అంది గాయాలు మానేలా చేస్తే శరీరంలోని అవయవాలు,కణాలు బతికే ఉంటాయని చెబుతున్నారు. నరికినతలలోనూ అలా ఊపిరి ఉంటుందంటున్నారు .

గుండె ఆగిపోగానే చనిపోయారని చాలా మంది అనుకుంటారని, ఒక్కో సారి మళ్లీ తనంతట తానే కొట్టుకోవడం మొదలుపెడుతుందని, దాన్నే ఆటో రిసస్టికేషన్ అంటారని చెబుతున్నారు . మెదడు విషయం మాత్రం వేరంటున్నారు . ఆక్సిజన్ , ఎనర్జీ సప్లై జరిగినంత వరకు మెదడు చురుగ్గా నే ఉంటుందని చెబుతున్నారు. అయితే, చచ్చిపోయాక కూడా ఆ ఆక్సిజన్ , ఎనర్జీ ఎక్కడి నుంచి అందుతున్నాయన్నదే తేలని విషయమంటున్నారు . మెదడుకు దెబ్బతగిలాక (ప్రైమరీఇంజురీ) దాంట్లో మరిన్ని ప్రాసెస్ లు జరుగుతాయట.దాన్నే సెకండరీ ఇంజురీ అని అంటున్నారు . ఫస్ట్​ ఇంజురీ కన్నా ఆ సెకండ్ ఇంజురీనే చాలా ప్రమాదమని చెప్పారు . ‘‘ఉదాహరణకు తలకు ఏదైనా పెద్ద దెబ్బ తగిలి.. దాని వల్ల మెదడులో బ్లీడింగ్ అవుతుంది .గడ్డకడుతుంది . వాటిని ఆపరేషన్ల ద్వారా ఆపొచ్చు.కానీ, ఆ మొదటి దెబ్బ వల్ల మెదడు ఉబ్బడం వంటివి జరుగుతాయి. ఆ టైంలో మెదడు పని మరింత మందగిస్తుంది . ఆ టైంలో రక్తపోటు తగ్గితే ఆక్సిజన్ అందదు.అది మెదడుపై మరింత ఒత్తిడి పెంచుతుంది . డ్యామేజ్ చేస్తుంది ” అని సైంటిస్టులు చెబుతున్నారు.

చావు నిమిషంలో వచ్చేది కాదు

పందుల మెదళ్లలోని కణాలను మళ్లీ పునరుత్తేజపరిచినా.. దానిపై మరిన్ని విషయాలు మాత్రం తెలియలేదంటున్నారు సైంటిస్టులు. జస్ట్​ ఎంత టైం మెదడు సర్వైవ్ అవుతుంది .. మెదడులోని నాడీ కణాల పనితీరు పరిధి వంటి వాటి వరకే తెలుసుకోవచ్చని అంటున్నారు .అయితే, పునరుత్తే జపరిచిన మెదడు కణాలు, స్పృహ, అవేర్నెస్ (బయట ఏం జరుగుతోం దో తెలుసుకునేశక్తి)కు కీలకమైన నాడీ కణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుందా లేదా అన్నది మాత్రం తేలలేదంటున్నారు . చనిపోయిన కొన్ని గంటలకు మెదడును పునరుత్తేజపరిచినా, కొన్ని రోజుల తర్వాత వాటి పరిస్థితి ఏంటన్నదీ తేల్చలేదు.చివరగా టెక్నికల్ గా చనిపోయినా మెదడులోని పెద్ద మొత్తంలో ‘గ్రే జోన్ ’ యాక్టివ్ గా ఉంటుం దని, భవిష్యత్తు లో దానిపై మరింత పురోగతి సాధించేలా పరిశోధనలు చేస్తామని చెబుతున్నారు . చావు అనేది ఒక్క క్షణం,నిమిషంలో అయ్యేది కాదని, అదో పెద్ద ప్రాసెస్ అని ముగించారు . ఈ ప్రయోగంతో కోమా,బ్రెయిన్ డెడ్ పేషెంట్ల ట్రీట్​మెంట్​కు మొదటి అడుగులు వేసినట్టవుతుందని అన్నారు .

Latest Updates