ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ప్రాంతాన్ని గుర్తించిన సైంటిస్ట్ లు

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాన్ని సైంటిస్ట్ లు గుర్తించారు భూమి పై నివసించే మానవులకు పొడవైన చెట్లు, లోతైన సముద్రాలు  గురించి తెలుసు కానీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం గురించి చాలా తక్కువ మందికే తెలుసు.

ఇక అసలు విషయానికొస్తే  పార్ట్స్ మౌత్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం  ఆఫ్రికాలో 100 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ల పై పరిశోధనలు చేసిన తరువాత ఎగిరే సరీసృపాలు మరియు మొసలి లాంటి  భయంకరమైన జంతువుల జాడల్ని కనుగొన్నారు.

ఆగ్నేయ మొరాకోలోని క్రెటేషియస్ శిలల నిర్మాణ ప్రాంతంగా ఇంగ్లాండ్‌ పాలియోంటాలజిస్టులు గుర్తించారు. దీనిని కెమ్ కెమ్ గ్రూప్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం భూమిపై అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా ప్రకటించబడింది. విస్తృతమైన నదులు, దాని చుట్టూ వివిధ రకాల జల మరియు భూ సంబంధమైన జంతువులు ఉన్నాయి.

దీన్ని డెట్రాయిట్ మెర్సీ విశ్వవిద్యాలయం, బయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్  సైంటిస్ట్  డాక్టర్ నిజార్ ఇబ్రహీం తెలిపారు.   ఇప్పటివరకు తెలిసిన అతిపెద్ద  డైనోసార్ల జాడలను గుర్తించిన నిజార్  మొసలితో పాటు  ఎగిరే సరీసృపాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతం భూ గ్రహంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. ఇది మానవుడు నివసించలేని ప్రమాదకరమైన ప్రాంతంగా సైంటిస్ట్ నిజార్ వెల్లడించారు.

Latest Updates