కరోనా వ్యాప్తి నివారణకు యాంటీ బాడీ ని కనుగొన్న సైంటిస్టులు

లండ‌న్‌: మనిషి శరీరంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే విషయంలో బ్రిటన్ లోని ఉట్రేచ్ట్ యూనివర్సిటీ సైంటిస్టులు గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా వైరస్ ను అడ్డుకునే విధంగా యాంటీ బాడీని గుర్తించినట్లు ఇది కరోనా ట్రీట్ మెంట్ లో కీలకం కానుందన్నారు. ఈ యాంటీ బాడీ అనేది సార్స్ కోవ్ 2 లోని ఒక కణాన్ని పట్టుకొని కరోనా వ్యాప్తిని శరీరంలో పెరగనివ్వదని తెలిపారు. ఈ పరిశోధనకు డాక్టర్ జేన్ బాష్ నేతృత్వం వహించారు. కొత్తగా కనుగొన్న ఈ యాంటీబాడీకి 47 డి 11 అని పేరు పెట్టారు. ఇది శరీరంలో కరోనా వైరస్ ను నిర్జీవం చేస్తుందని దీంతో వ్యాధి మరొకరికి రాకుండా అడ్డుకోవచ్చని డాక్టర్ జేన్ బాష్ తెలిపారు. ఎలుకలపై చేసిన ఈ యాంటీబాడీ టెస్ట్ లు సక్సెస్ అయ్యాయి. మనుషుల్లో కూడా ఇది పనిచేసే విధంగా జన్యుపరంగా మార్పులు చేశారు. ” ఈ యాంటీబాడీకి ఉన్న క్రాస్ న్యూట్రలైజింగ్ శక్తి కరోనా వ్యాప్తి అడ్డుకుంటుంది. సార్స్ కోవ్ 1 యాంటీ బాడీల ద్వారా సార్స్ కోవ్ 2 ను అడ్డుకునే కణాలను గుర్తించాం” అని డాక్టర్ జేష్ బాష్ చెప్పారు. దీనిపై మరింత పరిశోధనలు చేస్తున్నామన్నారు.

Latest Updates