లంగ్స్ లో క‌రోనా క‌ణాలు ఎలా ఉన్నాయో చూడండి : ఫోటోల్ని విడుద‌ల చేసిన సైంటిస్ట్ లు

ప్ర‌పంచ దేశాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న క‌రోనా వైర‌స్ ఆకృతి, ప‌నితీరు గురించి అంద‌రికి తెలిసిందే. కానీ క‌రోనా సోకిన బాధితుల శ‌రీరభాగాలపై దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే విష‌యం గురించి ఇప్ప‌టి వ‌ర‌కు వెలుగులోకి రాలేదు.

తాజాగా సైంటిస్ట్ లు క‌రోనా వైర‌స్ క‌ణాలు లంగ్స్ పై ఎలా దాడి చేస్తుంది. దాడి చేస్తే లంగ్స్ లో ఉన్న క‌రోనా క‌ణాలు ఎలా ఉంటాయో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు సైంటిస్ట్ లు.

నార్త్ కరోలినా యూనివ‌ర్సిటీ (యుఎన్‌సి) చిల్డ్రన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన సైంటిస్ట్ కెమిల్లె ఎహ్రే స‌హాక‌య‌కుల బృందం లంగ్స్ లో ఉన్న క‌రోనా క‌ణాలు ఎలా ఉంటాయానే అంశంపై ప‌రిశోధ‌న‌లు జ‌రిపారు. ఈ ప‌రిశోధ‌న‌ల్లో గాలి ద్వారా సోకిన క‌రోనా వైర‌స్ క‌ణాలు ఎలా ఉంటాయో వెలుగులోకి తెచ్చారు.

ప‌రిశోధ‌నల్లో మైక్రోస్కోప్ ద్వారా లంగ్స్ లోని క‌ణాల్ని గుర్తించి వాటిని విడుద‌ల చేశారు.

Latest Updates