చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం వెనుక కారణమిదే

కొద్ది.. లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతోంది. దీంతో కొత్త కొత్త రోగాలు వచ్చిపడుతున్నాయి. అంతేకాదు ఒకప్పుడు ముసలితనం చాయలుగా చెప్పే తెల్ల జుట్టు, బట్టతల ఇలాంటివి లేత వయసులోనే వచ్చేస్తున్నాయి. 20ల్లోకి వచ్చి రాక మునుపే జుట్టు తెల్లబడటం కనిపిస్తోంది. దీనికి కారణమేంటన్న దానిపై అమెరికాకు చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి స్ట్రెస్ (మానసిక ఒత్తిడి) కారణమని తేల్చారు.

మెదడులోని నరాలపై పడే ఎఫెక్ట్ వల్ల తెల్ల జుట్టు ముందే వచ్చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నాడీ వ్యవస్థలోని సింపథిటిక్ నరాలకు సంబంధించిన ‘ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్’ భాగానికి దీనితో లింక్ ఉందని తేల్చారు. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు పోరాడాలా? లేక తప్పుకుని వెళ్లాలా? అన్నది డిసైడ్ చేసే పార్ట్ ఇది. అతిగా టెన్షన్ పడేవాళ్లలో భాగం పదే పదే యాక్టివేట్ అవ్వడం వల్ల చిన్న వయసులోనే తెల్లజుట్టు వస్తుందని తెలిపారు శాస్త్రవేత్తలు.

హార్వర్డ్ శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధన చేశారు. రకరకాల స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వాటిపై అప్లై చేసి కార్టిజాల్ హార్మోన్ విడుదలను పరిశీలించారు. కార్టిజాల్‌ను విడుదల చేసే అడ్రినల్ గ్రంధిని తొలగించి మరికొన్ని ఎలుకలను పరీక్షించారు. ఎన్ని కోణాల్లో అధ్యయనం చేసినా.. వాటిపై ఒత్తిడి పెంచిన తర్వాత జుట్టు తెల్లబడటం గమనించారు. స్ట్రెస్ వల్ల సింపథిటిక్ నరాలపై ప్రభావం పడుతుంది. దీంతో జట్టులో నల్లదనానికి కారణమయ్యే మెలనోసైట్ స్టెమ్ సెల్స్ తగ్గిపోతాయి. ఇలా ఎక్కువగా జరిగే వాళ్లకు క్రమేపీ జుట్టు తెల్లబడిపోతుందని పరిశోధనను లీడ్ చేసిన స్టెమ్ సెల్ బయాలజిస్ట్ యాచే హుసు తెలిపారు.

More News:

మైనస్ 20 డిగ్రీల మంచులో జవాన్ల జెండా వందనం: వీడియో

నాలుగు తరాలుగా ఆర్మీకే అంకితం: కెప్టెన్ తానియాకి స్పెషల్ చాన్స్

ఆడ సింహం కోసం.. రెండు మగ సింహాల యుద్ధం: వీడియో

 

Latest Updates