గాలి ద్వారా కరోనావైరస్.. ఆధారాలున్నాయంటున్న సైంటిస్టులు

కరోనావైరస్ ఇప్పటివరకు మనిషి నుంచి మాత్రమే సోకుతుందని అనుకున్నాం. కానీ, గాలి ద్వారా కూడా సోకుతుందని వివిధ దేశాలకు చెందిన వందలమంది సైంటిస్టులు అంటున్నారు. దానికి సంబంధించి తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని వారంటున్నారు. అందుకే డబ్ల్యూహెచ్వో కరోనా విషయంలో తన గైడ్ లైన్స్ మార్చుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కరోనావైరస్ దగ్గినప్పుడు లేదా తుమ్మినపుడు ముక్కు లేదా నోటి నుండి బయటకు వచ్చిన తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరోకరికి వ్యాపిస్తుందని WHO తెలిపింది.

కరోనావైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు అంటున్నారు. దానికి సంబంధించిన ఒక అధ్యయనాన్ని వచ్చే వారం విడుదల చేయనున్నట్లు వారంటున్నారు. ఈ విషయంపై WHO ఇంకా స్పందించలేదు. అయితే WHO మాత్రం.. వైరస్ గాలిలో ఉన్నట్లు ఆధారాలు లేవని అంటోంది.

‘గత రెండు నెలలుగా మేం గాలి ద్వారా కరోనా సోకుతుందేమోనని పరిశోధనలు చేస్తున్నాం. గాలి ద్వారా సోకుతుందని మా దగ్గర ఖచ్చితమైన ఆధారాలు లేవు’ అని WHO టెక్నికల్ లీడ్ డాక్టర్ బెనెడెట్టా అల్లెగ్రాంజీ తెలిపారు.

For More News..

కిరాయి బస్సులకు పైసలిస్తలేరు

రోజూ 24 కి.మి. సైకిల్‌‌పై బడికి.. టెన్త్‌‌లో టాప్‌‌ సాధించిన రైతు బిడ్డ

పట్నం కొలువు పాయె.. ఊర్ల పనులే ఆసరాయె..

Latest Updates