జలప్రవేశం చేయనున్న ‘వెలా’

స్కార్పీన్ క్లాస్ స్టెల్త్ సబ్ మెరీన్‌‌‌‌ వెలా జలప్రవేశం చేయనుంది. ముంబైలోని మజ్ గావ్ డాక్ యార్డులో సోమవారం వెలా లాంచ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.అత్యాధునిక యంత్రాలు, టెక్నాలజీ కలిగిన వెలా సముద్రాలపై డేగ కన్ను వేయగలదు. ఇండియన్నేవీలోకి కమిషన్ చేసే ముందు వెలాకు పలుమార్లు ట్రయల్ రన్స్ నిర్వహించనున్నారు. స్కార్పీన్క్లాస్ సబ్‌‌‌‌మెరీన్లలో వెలా నాలుగోది. ఇప్పటివరకూ ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ ఖండేరి, ఐఎన్ఎస్ కరంజ్ సాగర ప్రవేశం చేశాయి. వీటిలోఐఎన్ఎస్ కల్వరిని నేవీలోకి కమిషన్ చేశారు. మిగిలిన రెండూ ట్రయల్ రన్స్‌‌‌‌లోనే ఉన్నాయి.మొత్తం మీద ఆరు స్కార్పిన్ తరగతి సబ్ మెరీన్లకోసం ‘ప్రాజెక్టు –75’ పేరిట ఇండియా–ఫ్రాన్స్మధ్య 2005లో ఒప్పం దం కుదిరింది. మిగిలిన రెండు సబ్ మెరీన్లు ఐఎన్ఎస్ వాగిర్, ఐఎన్ఎస్వాగ్ షీర్ తయారీలో ఉన్నా యి. ఇవీ మజ్ గావ్డాక్ యార్డులోనే తయారవుతున్నాయి. 2020కల్లా వీటి తయారీ పూర్తవుతుంది.

వెలాపేరెందుకు?
సబ్‌‌‌‌మెరీన్ ‘వెలా’ ఫాక్స్‌‌‌‌ట్రాట్ క్లాస్ కు చెందినది. అప్పట్లో సోవియట్‌‌‌‌ యూనియన్‌‌‌‌ (రష్యా) నుంచి ఇండియా దీన్ని కొనుక్కుంది. ఈ క్లాస్ కు చెందిన సబ్‌‌‌‌మెరీన్లు అన్నింటికీ వెలానే లీడర్. దీనికి గుర్తుగానే వెలా పేరును స్కార్పిన్ తరగతికి చెందిన నాలుగో సబ్‌‌‌‌మెరీన్‌‌‌‌కు పెట్టారు.

ఒక మెరీన్.. ఎన్నో మిషన్లు..
స్కార్పీన్ తరగతి సబ్‌‌‌‌మెరీన్లు చాలా రకాల మిషన్లలో పని చేస్తాయి. యాంటీ సర్ఫేస్ వార్ ఫేర్,యాం టీ సబ్‌‌‌‌మెరీన్ వార్ ఫేర్, గూఢచర్యం ,సముద్రాల్లో బాంబులు పెట్టడం, ఓ ఏరియాకుకాపలాకాయడంలో ఇవి దిట్ట. వీటి తయారీలోవాడిన అకౌస్టిక్ సైలెన్సింగ్ టెక్నిక్స్ అతి తక్కువశబ్దం వచ్చేలా చూస్తాయి. బయటకు వచ్చి నశబ్దాన్ని బాగా తగ్గించేందుకు స్పెషల్ ఫీచర్స్ఉన్నాయి. అందుకే వీటికి స్టెల్త్ సబ్ మెరీన్లుగాపేరొచ్చిం ది.

Latest Updates